సామ్ అంత హాట్ గా ఉండాటానికి గల కారణం?

Purushottham Vinay
టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత ఎంత పెద్ద అందగత్తె చెప్పనవసరం లేదు. తన అందానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మన చుట్టూ వుండే వాళ్ళలో ప్రత్యేకంగా కనిపించాలంటే తాను పాటించే కొన్ని సీక్రెట్స్ ని గతంలో సామ్ బయటపెట్టింది. అదేమిటంటే ఎప్పటికప్పుడు తన స్టైల్ మార్చుకుంటూ తనకంటూ సపరేట్ స్టాండర్డ్ ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఎక్కువగా లూజ్ గా ఉండే బట్టలు కాకుండా టైట్ ఫిట్ లో చూడగానే కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉండే బట్టలను ఆమె డిజైన్ చేసుకుంటుందట. ఎక్కువగా క్లాసిక్ లుక్ లో స్త్రీ తత్వాన్ని ప్రతిబింబించే బట్టలంటే తనకిష్టమని గతంలో సామ్ చెప్పుకొచ్చింది. ఇక తాను బయటకు వెళ్లాల్సి  సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడుతుందట. అది వాడితే టాన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అని సామ్ చెబుతోంది.సమంత ఇప్పుడు పూర్తిగా శాకాహారి, ఒకప్పుడు మాంసాహారి అయినా ఆమె ఇప్పుడు అవి తినడం పూర్తిగా మానేసింది. ఉపవాసాలు, డైటింగ్స్ జోలికి పూర్తిగా వెళ్లని సామ్ అన్ని రకాల శాఖాహార ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉంటుంది.

ఆమె ఏది తిన్నా కూడా వెంటనే జిమ్ చేస్తూ ఉండడంతో ఆమె శరీరంలో ఎక్కడా కొవ్వు చేరిన దాఖలాలు మనకు కనిపించవు. అయితే తన వ్యాయామాలకు తగినట్టుగా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి సామ్ ఇష్టపడుతూ ఉంటుందట.సమంత ఎన్ని పనులు ఉన్నా ఇంకా ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యాయామం చేయడం మాత్రం అస్సలు మానదు. రెండు పూటలా జిమ్ కి వెళ్లి ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడానికి వెచ్చిస్తూ ఉంటుంది. తన శరీరాన్ని ఎప్పటికప్పుడు స్లింగా ఉంచుకునేందుకు ఆమె కొత్త కొత్త వర్కౌట్లు నేర్చుకుని చేస్తూ ఉంటుంది. కేవలం ఒక్క ఫిట్నెస్ ట్రైనర్ కే పరిమితం కాకుండా మంచి మంచి ఫిట్నెస్ ట్రైనర్లు అందరి దగ్గర ఆమె ఫిట్నెస్ లో మెళకువలు నేర్చుకుంటూ ఉంటుంది. చెన్నై హైదరాబాద్ లోని తన నివాసాల్లో ఆమెకంటూ సపరేట్ జిమ్ సెట్ అప్ కూడా ఉంటుంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే అక్కడి జిమ్ సెట్ అప్ వాడుకుంటుంది లేదా జాగింగ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: