మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ అవుతున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల త్రిబుల్ ఆర్ మూవీతో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందుకొని దేశవ్యాప్తంగా భారీ పాపులాటిని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చరణ్ ఆస్కార్ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ కి నామినేట్ అయింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రస్తుత మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే చాలామంది అగ్ర హీరోల సినిమాలు రీరిలీజ్ అయి భారీ కలెక్షన్స్ ని సాధించాయి. 

పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి, తమ్ముడు.. మహేష్ బాబు పోకిరి, ఒక్కడు.. బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి ఇలా ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' రీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ సినిమాని మళ్లీ థియేటర్స్లోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమా రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో మెగా ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మళ్లీ థియేటర్స్ లో మగధీర సినిమా కనుక రీ రిలీజ్ అయితే గత సినిమాల కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే..  సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: