వాయిదా పడ్డ PS 2 విడుదల?

Purushottham Vinay
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఇటీవల తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం పొన్నియన్ సెల్వన్..2022 సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ, హిందీ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. మిగతా భాషల్లో ఏమో కానీ తమిళ భాషలో మాత్రం ఈ సినిమా చాలా బాగా మెప్పించింది. వారి నేటివిటీకి తగ్గట్లు ఉండటం వల్ల ఈ కథ వారినేంతగానో ఆకట్టుకుంది. ఇక కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ పై మణిరత్నం ఇంకా అలాగే అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించారు. విక్రమ్ , కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ బచ్చన్ , ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ ఇంకా నీలలుగల్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి మంచి ప్రేక్షకుల ఆదరణ బాగా పొంది కలెక్షన్లను కూడా భారీగా రాబట్టింది.దాదాపు 450 కోట్ల పైగా ఈ సినిమా వసూళ్లు రాబట్టింది.ఇక నవంబర్ 4 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


ఇదిలా ఉండగా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  పొన్నియన్ సెల్వన్ 2 సినిమా షూటింగు ఎప్పుడో ప్రారంభమై షెడ్యూల్ చివరి దశకు కూడా చేరుకుంది. ఇక మొన్నటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు విడుదల తేదీ గురించి ఆలోచిస్తుంది.అంతకముందు ఏప్రిల్ 28 న ఈ సినిమా విడుదల చెయ్యాలని మేకర్స్ భావించారు. ఇంకా కొంచెం వర్క్ ఉండటం వల్ల విడుదల తేదీని వాయిదా వెయ్యాలని భావిస్తున్నారు. ఇక కొత్త విడుదల తేదీ ని ఈ వీకెండ్ కి ప్రకటించే అవకాశం వుంది.దీంతో ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.ఇక పార్ట్ 2 పై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలని అందుకొని ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS2

సంబంధిత వార్తలు: