మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఫోన్ రింగ్ టోన్ ఏంటో తెలుసా?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్ ఏదైనా సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చాడు అంటే ఆ పాట అటు సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారిపోతూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతుంది. ఇక ఇటీవల కాలంలో అద్భుతమైన మ్యూజిక్ కి తమను కేరాఫ్ అడ్రస్ గా  మారిపోయాడు. అతను అందించే సంగీతానికి ఫిదా అయిపోయిన ప్రేక్షకులు అతనికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో తమన్ అయితేనే మ్యూజిక్ హీట్ అవుతుందని నమ్ముతున్నారు.

 ఇటీవల కాలంలో ఏదైనా స్టార్ హీరో సినిమా పట్టాలెక్కపోతుంది అంటే చాలు ఇక ఆ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటాడని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఇప్పటికే మ్యూజిక్ అందించి సెన్సేషన్ సృష్టించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు అందించిన థమన్ తన ఫోన్ లో రింగ్ టోన్ గా  ఏ హీరో పాట పెట్టుకున్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు.

 అయితే ఇక ఈ విషయం గురించి తెలిసి అభిమానులు అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు వందల సాంగ్స్ కంపోజ్ చేసిన తమన్ తమిళ హీరో ఇలయ దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోని ఒక మ్యూజికల్ బిజీఎమ్ ను తన ఫోన్ కి రింగ్ టోన్ గా పెట్టుకున్నాడట. నేపథ్య సంగీతాలతో వచ్చే మాస్టర్ సినిమా బిజిఎం అంటే తమన్ కి చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే ఆ మ్యూజిక్ ని రింగ్ టోన్ గా పెట్టుకున్నాడట. ఈ విషయం గురించి తెలిసి తమన్ కి విజయ్ అంటే మరీ ఇంత ఇష్టమా అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: