నాగార్జునతో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లరి నరేష్..!

Divya
సీనియర్ హీరోలలో ఒకరిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నవ మన్మధుడిగా టాలీవుడ్ కింగ్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న నాగార్జున ప్రస్తుతం సరైన కథల ఎంపిక కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. భిన్నమైన కథలను ఎంచుకొని ఒకప్పుడు విజయాలను అందుకుంటున్న నాగార్జునకు ఈ మధ్యకాలంలో వరుసగా షాకులు తగులుతున్నాయి. దీంతో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు కొంతమంది నెటిజన్స్ కూడా నాగార్జున కథల ఎంపిక విషయంలో ఇంకా మారాల్సి ఉంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా నాగార్జున,  అల్లరి నరేష్ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే..  అయితే ఈ వార్తలపై అల్లరి నరేష్ స్పందిస్తూ..  షాకింగ్ కామెంట్లు చేశారు.. తాజాగా వరుస సీరియస్ సినిమాలలో నటిస్తున్న అల్లరి నరేష్ లుక్  కూడా పూర్తిస్థాయిలో మారిపోయింది.  మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.  విజయ్ కనక మేడల డైరెక్షన్లో అల్లరి నరేష్ తరువాత సినిమా తెరకెక్కబోతోంది.. కాబట్టి ఈ సినిమాతో అల్లరి నరేష్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి..
ఇకపోతే నాగార్జునతో సినిమా గురించి అల్లరి నరేష్ స్పందిస్తూ ఈ సినిమాకు ఇంకా సైన్ చేయలేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.. ఈ సినిమాకు సంబంధించి చర్చలు ఇంకా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు..  ఇకపోతే నాంది సినిమా సీక్వెల్లో కూడా తాను నటిస్తానని అల్లరి నరేష్ వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం అల్లరి నరేష్ రెమ్యునరేషన్ రూ.3 కోట్లకు పైగా తీసుకుంటున్నారు.. ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా తక్కువ ఏమీ కాదు..  కాబట్టి అల్లరి నరేష్ ఈ సమయంలో సరైన ప్రాజెక్టులను ఎంచుకుంటే గనుక ఆయన కెరియర్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: