తారక రత్న చివరి కోరిక ఎన్టీఆర్ తీరుస్తాడా...?

murali krishna
నందమూరి తారకరత్న మరణ వార్త అభిమానులను మరియు యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే.చాలా చిన్న వయస్సులోనే ఆయన తన ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా బాధాకరం.ప్రతీ ఒక్కరితో నూ మంచిగా ఉంటూ, అందరిని ఎంతో ప్రేమగా పలకరించే తారకరత్న ఇక లేడు అనే విషయాన్నే జీర్ణించుకోవడం కష్టం.రీసెంట్ గానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తారకరత్న, తెలుగుదేశం పార్టీ లో గుడివాడ ప్రాంతం నుండి పోటీ చెయ్యాలి అని అనుకున్నాడట..
గత కొద్దీ రోజుల నుండి ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నాడు, ఆలా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న తారకరత్న కి ఇలా జరగడం నందమూరి అభిమానులకు బాధ కలిగిస్తుంది..ఈ బాధ నుండి వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఇది ఇలా ఉండగా తారకరత్న తన చివరి కోరిక గురించి జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ అధికారిక ప్రకటన చేసిన వెంటనే తారకరత్నకు శుభాకాంక్షలు తెలియచేసిన మొదటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.నువ్వు చాలా మంచోడివి,, కచ్చితంగా నువ్వు రాజకీయాల్లో రాణించగలవు, ఆల్ ది బెస్ట్ అంటూ తారకరత్న కి ఎన్టీఆర్ చెప్పాడని సమాచారం..అప్పుడు తారకరత్న ఎన్టీఆర్ తో మాట్లాడుతూ 'నువ్వు కూడా రాజకీయాల్లోకి  కచ్చితంగా రావాలి తమ్ముడు.తెలుగు దేశం పార్టీ నీకోసం ఎదురు చూస్తుంది, కోట్లాది మంది అభిమానుల కూడా కోరుకున్నట్లు గానే నేను కూడా నువ్వు సీఎం అవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నాను.ముఖ్యమంత్రి సీట్ లో నిన్ను చూడాలి అనేది నాకోరిక' అంటూ చెప్పుకొచ్చాడట తారక రత్న

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.అంతే కాకుండా బాలయ్య  తో కలిసి ఒక సినిమాలో నటించాలని తారకరత్న ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు.త్వరలో అనిల్ రావిపూడి తో బాలయ్య చెయ్యబోతున్న సినిమాలో కూడా తారకరత్న కి మంచి పాత్ర కూడా వచ్చిందట.కానీ ఇలా సడన్ గా జరగడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: