బాలయ్య వీర సింహారెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా...?

murali krishna
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన  బ్లాక్ బస్టర్ మూవీ ''వీరసింహారెడ్డి''..  సంక్రాంతి బరి లో ఈ సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు బాలయ్య.
యాక్షన్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''వీరసింహారెడ్డి''.. ఈ సినిమా సంక్రాంతి కానుక గా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ఖాతా లో మరో బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది.
బాలయ్యకు జోడీ గా శృతి హాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటించారు.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.. అందుకే ఇప్పుడు ఓటిటీలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుందని సమాచారం..
బాలకృష్ణ కెరీర్ లోనే పెద్ద సక్సెస్ అందుకున్న ఈ సినిమా 23న సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది... కాగా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ గురించి బాలయ్య నుండి చిన్న వీడియో క్లిప్ కూడా వచ్చింది.. వీరసింహారెడ్డి సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కావొద్దు అంటూ ఫ్యాన్స్ ను అలాగే ఆడియెన్స్ ను కోరారు బాలయ్య.. మరి సోషల్ మీడియా వేదిక గా బాలయ్య నుండి వచ్చిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. థియేటర్స్ లో  దుమ్ము లేపిన వీరసింహారెడ్డి ఓటిటిలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: