ఏజెంట్ ఫస్ట్ సింగిల్: అఖిల్ దుమ్ములేపుతాడా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇంకా సీనియర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్.. ఒక రా ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. అతని కెరిర్లో ఈ సినిమా ఎన్నడూ లేని భారీ హైప్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రోల్ అల్ట్రా పవర్ఫుల్గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ఇంకా టీజర్ చూస్తే పూర్తిగా అర్థమవుతోంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్లో జోరు పెంచిన మూవీ టీమ్ ఇక నుంచి రోజుకో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ ని నింపుతోంది.ఇక తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ అప్డేట్ కూడా వచ్చేసింది. 


ఫిబ్రవరి 22 సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు తొలి పాట 'మళ్లీ మళ్లీ 'ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయబోతున్నట్లు టీం పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసింది. ఇది అక్కినేని  అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఇకపోతే ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా హిప్ హాప్ రాపర్ అయిన హిప్హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి టాలీవుడ్ లో మంచి పేరుంది. అందుకు తగ్గట్లు ఈ సినిమాను స్టైలిష్ గా పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. దాదాపు రూ.90కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది.మరి ఫస్ట్ పాటతో అఖిల్ ఆకట్టుకుంటాడో లేడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: