వైరల్ గా మారిన తారకరత్న ఆస్తుల విలువ..!

Divya
నందమూరి తారకరత్న అకాల మరణం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారకరత్న ఈ సినిమాతోనే తన కెరీర్ను మొదలుపెట్టారు. హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి.. సినిమాలలో సత్తా చాటే ప్రయత్నం చేశారు కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.. ఇకపోతే ఇటీవల రాజకీయాలలోకి రావాలని ప్రయత్నించిన తారకరత్న కుప్పంలోని పాదయాత్రలో గుండెపోటుకు గురై 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం శివరాత్రి రోజున మరణించారు.
తారకరత్న ఆస్తుల విలువ ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి మొత్తంగా తారకరత్న ఆస్తులు విలువ రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలాగే పెండ్లి తర్వాత అలేఖ్య రెడ్డి తన కుటుంబం నుంచి రూ. 250 కోట్ల ఆస్తిని తీసుకొచ్చిందట. ప్రస్తుతం తారకరత్న పిల్లలకు సంబంధించిన బాధ్యతలను బాలయ్య ఇతర నందమూరి హీరోలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తారకరత్నకు సొంతంగా పలు థియేటర్లు , హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఖరీదైన ఏరియాలలో స్థలాలతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది మోహన్ కృష్ణ థియేటర్ తారకరత్న థియేటర్లు కూడా ఈయన సొంతం.
ఎంకే ట్రేడర్స్ పేరుతో సొంతంగా తారకరత్నకు బిజినెస్ ఉందని కూడా సమాచారం.. ఇకపోతే తారకరత్నకు 9 అనే నంబరు కలిసి రాలేదని అందుకే ఆయన జీవితంలో ఈ తొమ్మిది నెంబర్ చెడు అంకెగా మారి ఆయన జీవితాన్ని నాశనం చేసింది అని చెబుతూ ఉంటారు.. తాజాగా తారకరత్న నటించిన పోలీసులు సినిమాలు చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లలో రిలీజ్ కావలసి ఉండదు కొన్ని కారణాలవల్ల ఆగిపోయాయి మొత్తానికైతే తారకరత్న మరణం ఎవరిని అంత త్వరగా మరిచిపోయేటట్టు చేయలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: