ఏంటి.. చిరంజీవి అప్పట్లోనే పాన్ ఇండియా మూవీని వదులుకున్నాడా?

praveen
డైరెక్టర్ శంకర్.. ఈయనకి భారతీయ చలనచిత్ర పరిశ్రమంలో ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది దర్శకులు ఉన్న.. ఈయన టేకింగ్ స్టైల్ మాత్రం ఎంతో సపరేట్. ఇక అదే ఆయనను అందరిలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. సరికొత్త టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ కంటే తోపులు ఇంకెవరూ లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు హాలీవుడ్కు మాత్రమే పరిమితమైన కొన్ని గ్రాఫిక్ ని వాడుకుని ఇక సరికొత్తగా సినిమాలను తీసి ప్రేక్షకులకు ముందు వచ్చాడు శంకర్. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా   నటిస్తుంది అని చెప్పాలి. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే శంకర్ ఒకప్పుడు చరణ్ తండ్రి చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నారట. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో ముందుగా చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నాడట.

 అయితే ఆ సమయంలో కథను చిరంజీవికి వినిపించారట శంకర్. కానీ ఇక అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా శంకర్ సినిమా కోసం చిరంజీవి డేట్స్ కేటాయించలేకపోయారట. ఇక తర్వాత ఈ సినిమా అర్జున్ వద్దకు వెళ్ళగా.. అతను చేసి సూపర్ డూపర్ విజయాన్ని సాధించాడు. ఈ సినిమా చేసి ఉంటే అప్పట్లోనే చిరంజీవి పాన్ ఇండియా హిట్ కొట్టేవాడు అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి అయ్యయ్యో మెగాస్టార్ ఇంత మంచి ఛాన్స్ వదిలేసుకున్నాడా అనే ఎంతో మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: