బన్నీ రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. నాని చాన్స్?
ఇక ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ దసరా సినిమా పైన నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పుడు నాని ఒక సీక్వెల్ కోసం సిద్ధమయ్యాడు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు వేణు శ్రీరామ్ - నాని కాంబినేషన్ సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తరహా కథాంశాన్ని తీసుకుని తమ్ముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అక్క తమ్ముడు సెంటిమెంట్ తో ఇక ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఎంసీఏ సినిమాలో నానికి వదినగా నటించిన భూమిక.. ఇక ఈ సినిమాలో నానికి అక్క పాత్రలో కనిపించబోతుందని బొగట్ట.
అయితే ఈ సినిమాకు సంబంధించి మాత్రం అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నాడు నాచురల్ స్టార్ నాని. ఇక అలాంటిది వేణు శ్రీరామ్‌కు నాని ఓకే చెబుతాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే దసరా సినిమా తర్వాత ఇక నాని హిట్ 3 సినిమాలో నటించబోతున్నాడు. అయితే వేణు శ్రీరామ్ ఇప్పటికే ఒక కథతో బన్నీ దగ్గరికి వెళ్ళగా.. బన్నీ ఛాన్స్ ఇవ్వలేదట. కానీ బన్నీ రిజెక్ట్ చేసిన దర్శకుడితో ఇక ఇప్పుడు నాని సినిమా చేయబోతున్నాడు అనే వార్త మాత్రం బాగా వైరల్ గా మారిపోయింది.