తన పై ట్రోల్స్ చేయడానికి కారణం చెప్పిన హీరో ::: విష్ణు

murali krishna
టాలీవుడ్ హీరోల్లో ఒకరైన మంచు విష్ణు ఇండస్ట్రీ లో గట్టిగా నిలబడడానికి ఆయన సర్వశక్తుల కష్టపడుతుంటారు. కానీ ఆయనకి గట్టి హిట్ మూవీస్ పడటం లేదు. ఒకానొక సందర్భంలో ఆయన తన అక్క, తమ్ముడు గూర్చి ఓపెన్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఒక ఇంట్లో వాళ్ళు అంతా ఒకేలా ఉండాలని ఏమి ఉండదు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అందుకే అన్నదమ్ములైన అక్క చెల్లెలు అయినా ఒక్కొక్కరు ఒక్కో బిన్న మనస్తత్వం కలిగి ఉంటారు.
ఐతే ఇదే విషయాన్ని లేటెస్టుగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా చెప్పారు. మంచు విష్ణు తనకు తన తోబుట్టువులు అయిన లక్ష్మీ మరియు మనోజ్ లకి చాలా వ్యత్యాసాలు ఉంటాయని చెప్పారు. ఐతే మరీ ముఖ్యంగా తాను ఒక్కడినే భిన్నంగా ఉంటాడని, అక్క మరియు తమ్ముడు ఇద్దరు ఒకే విధంగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చాడు.
ఐతే నేనొక పెద్ద మోడీ టైపు అని కానీ లక్ష్మీ మరియు మనోజ్ అలా కాదని వారు చాలా హుషారుగా ఉండడానికే ప్రయత్నిస్తారు అని చెప్పుకొచ్చాడు. రాత్రి ఎనిమిది అయింది అంటే భోజనం చేసి తొమ్మిదింటికల్లా నిద్రపోతానని పార్టీలకు, పబ్బులకు వెళ్ళనని, క్లాస్ టైప్ కల్చర్ తనకు తెలియదని చెప్పాడు. తనకు మిగతా వారికున్నట్టు ఎలాంటి అలవాట్లు కూడా లేవని, చాలా ఫ్యామిలీ మ్యాన్ నీ అని కూడా చెప్పుకొచ్చారు విష్ణు.
అలాగే  తనకు తన పిల్లలు భార్య మాత్రమే ప్రపంచమని తెల్లవారు జామునే నిద్రలేస్తానని రోజంతా పనిచేసే త్వరగా పడుకుంటానని చెప్పుకొచ్చాడు. నేను త్వరగా అందరికీ బోర్ కొట్టేస్తానని అందుకే ఎవరితో ఎక్కువగా కలవలేనని చెప్పాడు. నా భార్య విన్ని కూడా నన్ను అర్థం చేసుకుంటుంది కాబట్టి నా కుటుంబంతోనే కలిసి ఎక్కువ సమయం గడుపుతానని చెప్పుకొచ్చాడు విష్ణు. కానీ లక్ష్మీ మరియు మనోజ్ ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తారని, ఎక్కువగా కలిసి ట్రావెల్ చేస్తారని, వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు. వారితో కూడా నేను ఎక్కువ కలువను అని, పని విషయంలో తప్ప మామూలుగా పిచ్చా పాటీగా ఉండలేనని చెప్పాడు. పైగా నేను వస్తున్నాను అంటే మనోజ్ లేచి నిలబడతాడని అక్క వస్తే నేను లేచి నిలబడతానని చెప్పాడు విష్ణు. పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటానని అందుకే జనాలు నన్ను బాగా ట్రోల్ చేస్తారని కూడా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు విష్ణు.
అలా చెప్పిన ఈ వ్యాఖ్యలకు నేటిజన్లు ఇంకా ట్రోల్ల్స్ చేయడం స్టార్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: