బాలీవుడ్ లో రీమేక్ కానున్న లవ్ టుడే?

Purushottham Vinay
గత సంవత్సరం చివరిలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న తమిళ మూవీ ‘లవ్ టుడే’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి ఇంకా స్వీయ దర్శకత్వంలో తెరక్కించాడు.ఇందులో ఇవానా హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. లవర్స్ ఫోన్ మార్చుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా..అసలు భాషతో సంబంధం లేకుండా అందర్నీ ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ విజయం అందుకుంది.ఇక ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కి.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా రిలీజ్ అయ్యి అందుబాటులోకి వచ్చేసింది. కాగా ఈ సినిమాని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.


బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ‘ఫాంటమ్ స్టూడియోస్’ తో కలిసి ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సూపర్ హిట్ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని ఫాంటమ్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.అయితే హిందీలో మాత్రం ఈ సినిమాని ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయబోతున్నాడా? లేదా? అనేది ఇంకా తెలియదు. ఇంకా అలాగే మూవీలో నటించే నటీనటులకి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈమధ్య కాలంలో సౌత్ లో సూపర్ హిట్ అయినా మూవీస్ అన్నిటిని బాలీవుడ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా విఫలం అవుతున్నాయి.రీసెంట్ గా విక్రమ్ వేద, జిగర్తాండ, జెర్సీ, అలవైకుంఠపురంలో ఇంకా హెలెన్.. ఇలా వరుస పెట్టి అన్ని సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీ అయినా అక్కడ హిట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: