పఠాన్.. టాప్ ఫైవ్ లో నిలిచిన షారుక్ ఖాన్..!!

Divya
షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. విలన్ గా జాన్ అబ్రహం నటించారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్భుతమైన టాక్ తో కలెక్షన్లు సునామిని సృష్టించింది. మొదటి వీక్ లోనే 100 కోట్లకు పైగా క్రాస్ వసూళ్లను అందుకుంది.

దాదాపుగా షారుఖ్ ఖాన్ నుంచి నాలుగేళ్ల విరవం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూశారు. ఎగ్జిటింగ్ అనుగుణంగానే ఈ సినిమా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఉన్నామని సృష్టించింది. దాదాపుగా కొన్ని సినిమాలు చరిత్రను కూడా తిరగరాసిందని తెలుస్తోంది. ఈ మూవీ ఏకంగా రూ .1000 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు తాజాగా అందుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూ .1000 కోట్ల గ్రాస్ ని దాటిన సినిమాల జాబితాలలో చోటు దక్కించుకున్న చిత్రంలో ఇది కూడా ఒకటి.

ఇక దంగల్ మూవీ 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మొదటి స్థానంలో ఉంది అయితే దంగల్ మూవీ ఇండియాలో కంటే చైనాలోని అత్యధిక కలెక్షన్లను సాధించడం విశేషమని చెప్పవచ్చు ఇక రెండవ స్థానంలో బాహుబలి-2 నిలువగా మూడవ స్థానంలో కేజిఎఫ్-2 సినిమా నిలిచింది ఇదిలా ఉంటే రాజమౌళి rrr మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ  రూ.1000 కోట్లతో 5వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తానికి షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరడంతో అటు అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 1000 కోట్ల జాబితా అందుకునే చిత్రాలలో సలార్, పుష్ప -2, ప్రాజెక్ట్-k , ఆది పురుష్  వంటి చిత్రాలు ఉన్నాయనీ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: