పఠాన్: 1000 కోట్ల క్లబ్ లో షారుఖ్ ఖాన్?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్  హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పఠాన్. దీపికా పదుకునే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోయిన్ గా నటించగా ఇక మరో హీరో జాన్ అబ్రహం విలన్ పాత్రలో మెరిసాడు.ఇక ఈ సినిమా జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదటి రోజు నుంచి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్స్ సునామీ సృష్టించింది.  తొలి రోజు నుంచి ఒక వారం పాటు ప్రతి రోజు వంద కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది.  అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ నుంచి నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎగబడి ఈ సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూశారు. ఇంకా ఇదిలా ఉంటే ఈ మూవీ బాలీవుడ్ లో చాలా ఎక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డ్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్స్ తెలిపారు.


 ఇదిలా ఉంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిన సినిమాల జాబితా ఒకసారి చూసుకుంటే అమీర్ ఖాన్ దంగల్ మూవీ రెండు వేల కోట్లకి పైగా కలెక్ట్ చేసి మొదటి స్థానంలో ఉంది.అయితే దంగల్ మూవీ మాత్రం ఇండియాలో కంటే చైనాలో చాలా ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇక రెండో స్థానంలో బాహుబలి 2 సినిమా నిలిచింది. ఈ సినిమా కూడా 1800 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక మూడో స్థానంలో కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 నిలవడం విశేషం.ఇక బాహుబలి 2 తర్వాత 1200 పైగా కోట్లతో ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 నిలవగా దీని తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ కూడా 12వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది.ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఐదో సినిమాగా రికార్డుల్లో నిలవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: