రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన త్రిష..!
ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమాలో త్రిష కి అవకాశం కల్పించారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ నిమిత్తం కాశ్మీర్ కి వెళ్ళిన చిత్రబృందం అక్కడ 15 రోజులపాటు సినిమా షూటింగ్ పూర్తి చేశారు..కానీ చలి కారణంగా త్రిష అక్కడి నుంచి జ్వరం రావడంతో చెన్నై చేరుకుంది. ఈ నేపథ్యంలోనే త్రిష లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లియో సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి. కానీ వీటిపై స్పందించిన త్రిష లియో సినిమా షూటింగ్ నుంచి రావడం కొన్ని అనారోగ్య కారణాలవల్లే.. కానీ సినిమా నుంచి తప్పుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
నిజానికి తాను లియో సినిమా నుంచి తప్పుకోలేదు అని అందులో మిగతా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది అందులో భాగం కానున్నాను అని త్రిష వెల్లడించింది. ఇక మరొకవైపు ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ బ్రిందా మాత్రం ఆగిపోయింది.. అయితే ఈ వెబ్ సిరీస్ ఎందుకు ఆగిపోయింది అనే విషయంపై మాత్రం త్రిష క్లారిటీ ఇవ్వలేదు.