కాజల్ అగర్వాల్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఆ మూవీయేనా......!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత అనేక  సినిమాలతో హీరోయిన్ గా చేసిన సంగతి తెల్సిందే. ఐతే వాటిలో ముఖ్యంగా చందమామ, మగధీర సినిమాలు కాజల్ అగర్వాల్ కెరియర్ లో ఎప్పటికి మర్చిపోలేని మైల్ స్టోన్స్ గా నిల్చిపోయాయి.
ఐతే అటువంటి మూవీస్లో చేసిన తర్వాత కాజల్ అగర్వాల్ వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడి గా నటించే ఛాన్సెస్ దక్కించుకుంది. ఐతే ఆమె మొదటి నుండే లేడీ ఓరియంటెడ్ మూవీస్లకు నో చెబుతూ వస్తున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలం లో పెళ్లి అయ్యి తల్లి కూడా అయింది.
ఐతే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా లకు ఒకే చెప్పొచ్చు ఏమో అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఐతే ఆమె నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి మూవీ తో రీఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ అగర్వాల్ సిద్ధమయ్యింది. ఈ టైంలో ఆమె కు ఒక యువ డైరెక్టర్ లేడి ఓరియంటెడ్ కథ ను చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించాడట. ఐతే ఆమె మాత్రం కనీసం ఆ కథ ను వినేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. ఆమె కేవలం కమర్షియల్మూవీ లో నటించాలని హీరో లకు జోడిగా హీరోయిన్ గా నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తుందట. కెరియర్ లో మరికొన్నాళ్ల పాటు కమర్షియల్ హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకొని ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు కొన్నాళ్లు చేసి ఇండస్ట్రీకి దూరమవ్వాలని కాజల్ అగర్వాల్ భావిస్తుందేమో అంటూ సినీ వర్గాల వారు తమ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బాలకృష్ణ తో ప్రెసెంట్ చేయబోతున్న సినిమా కు సంబంధించిన అప్డేట్ అధికారికంగా రావాల్సిందే. ఐతే ఆ మూవీ హిట్ అయితే మాత్రం ఆమెకు కచ్చితంగా రానున్న రోజుల్లో భారీగా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: