కొడుకుల నిర్మాణంలో చేసిన తండ్రులు...ఆ రికార్డు వారికే సొంతం....!!

murali krishna
ప్రెసెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో ఎంతోమంది హీరోలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఆగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు పాన్ ఇండియా హీరోలుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఈ విధంగా పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో మంచి ఆదరణ పొందిన  వారిలో రామ్ చరణ్ ఒకరు. అలాగే మంచు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు పలు మూవీస్ లతో చాలా బిజీగా ఉన్నారు.
ఐతే విరిద్దరూ ఈ జనరేషన్లో ఒక  అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు.ఐతే ఈ ఇద్దరు హీరోలు సాధించిన ఆ ఘనత ఏంటి అనే విషయాన్ని వస్తే రామ్ చరణ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం మనకు తెలిసిందే.రామ్ చరణ్ తన ఇంటి పేరుతో కొనిదెల ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి తన యొక్క నిర్మాణ సంస్థలో తన తండ్రి హీరోగా ఖైదీ నెంబర్ 150 మూవీ ని నిర్మించారు.ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇతే ఈ మూవీ అనంతరం గాడ్ ఫాదర్ ఆచార్య సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలు కూడా ఆయన నిర్మించారు.
అలాగే ఏ విధంగా ఐతే రాంచరణ్ తన సొంత నిర్మాణంలో తన తండ్రితో మూవీస్ చేసాడో అదే విధంగానే మంచు విష్ణు కూడా తన సొంత నిర్మాణంలో తన తండ్రితో సినిమాలు చేశారు. ఈ విధంగా ఈ విషయంలో వీరిద్దరు ఒక కొత్త రికార్డు క్రియేట్ చేశారని చెప్పాలి.మంచు విష్ణు తన సొంత నిర్మాణంలో మోహన్ బాబు హీరోగా సన్నాఫ్ ఇండియా అనే చిత్రాన్ని చేశారు.ఐతే ఈ మూవీ  పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కొడుకు నిర్మాణ సంస్థలో నటించిన తండ్రులుగా మోహన్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఐతే ప్రెసెంట్ విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగా, రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నా మూవీతో చాలా బిజీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: