కాంతారా 2 లో సూపర్ స్టార్.. నిజమేనా..?

Divya
కన్నడ సూపర్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా.. ఈ సినిమా గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో సంచలనం సృష్టించింది.  మొదట కన్నడలో విడుదలయి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషలలో కూడా విడుదల కావడం జరిగింది. అలా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.  తెలుగు, హిందీ భాషల్లో కూడా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది కాంతారా.
ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఒక రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే కాంతారా 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. కానీ ఇందుకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ విడుదల కాలేదు.  కానీ తాజాగా కాంతారా హీరో రిషబ్ శెట్టి దీనిపై స్పందిస్తూ 2024లో కాంతారా 2 విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని కాంతారా ఈ సినిమా సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని తెలిపారు. అయితే మొదటి భాగం కథ ఎక్కడైతే ప్రారంభం అయ్యిందో దానికి ముందు జరిగిన సంఘటనలను కాంతారా 2 లో
 చూపించబోతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  అసలు విషయం ఏమిటంటే కాంతారా 2 లో  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇదే విషయాన్ని రిషబ్ శెట్టి ని ప్రశ్నించగా ఆయన మౌనంగా ఉన్నారు దీంతో కచ్చితంగా ఈ సినిమాలో రజనీకాంత్ నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంతారా సినిమా విడుదలైనప్పుడు రిషబ్ శెట్టిని తన ఇంటికి పిలిపించి ఆయనకు శాలువా కప్పి, గోల్డ్ చైన్ ని కూడా అందించి ఘనంగా సత్కరించారు.  రజినీకాంత్ ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: