వెంకీ సినిమాలో మరొక హీరో.. ఎవరంటే..?

Divya
నటుడు వెంకటేష్ విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఆ పాత్రను హైలైట్ గా చేస్తూ ఉంటారు.ఇప్పుడు తాజాగా సోలోగా సైందవ్ అనే టైటిల్ తో మరొకసారి కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన వెంకటేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వైవిద్యమైన థ్రిల్లర్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న శైలేష్.. వెంకటేష్ ఈసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా క్యాస్టింగ్ లో కూడా భారీ ఎత్తున ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికిని ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఆయన ఎంట్రీతో ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టులోకి తమిళ హీరో ఆర్య కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆర్య కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆర్య పాత్ర చాలా శక్తివంతమైనదిగా ఉంటుందని సమాచారం. నటుడు ఆర్య మాత్రం ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేసి ఉండారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం గమనార్హం. నటుడుగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు కానీ అవేవీ భారీ నిర్మాణంతో చేపట్టిన సినిమాలు కావు. దక్షిణాది తో పాటు అన్ని భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అప్పటి పరిస్థితులను బట్టి ఈ సినిమాని భోజపురి లో కూడా విడుదల చేసి అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: