ఆసక్తిరేపుతున్న 'సునీల్ ' మూవీ టీజర్ ......!!

murali krishna
ఇండస్ట్రీ లో కొత్త కొత్త కథ చిత్రాలను  అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటానికి స్టార్ట్ ఐనా నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్‌. ఈ పతాకం పై తెరకేక్కుతున్న మొదటి చిత్రం 'కథ వెనుక కథ'.
విశ్వంత్‌ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ మెయిన్ రోల్స్ తో చేస్తున్నారు.కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్నా ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని రిలీజ్‌ చేశారు. టీజర్‌ ఐతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, సినిమా మంచి  హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ మూవీ టీజర్‌ను అబ్సర్వ్ చేస్తే ఓ యంగ్‌ డైరెక్టర్‌  మరో క్యారెక్టర్ కు ఓ క్రైమ్‌ కథను చెప్పటంతో టీజర్‌ మొదలు అవుతుంది.సిటీలో చాలా వరకు మిస్సింగ్‌ కేసులుగా నమోదు అవుతున్న అమ్మాయిలను ఎవరో మర్డర్ చేస్తుంటారు. ఇంత భయంకరమైన హత్యలను చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు చిక్కదు. దీంతో వారు కేసుని సత్య అనే క్యారెక్టర్ చేసే సునీల్ అనే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదని, ఓ గ్యాంగ్‌ కలిసి ఈ హత్యలను చేస్తుందని సత్యకు తెలుసుకుంటాడు. ఐతే మరి ఈ విషయాన్ని సత్య ఎలా కనుక్కుకున్నాడు,అతను టీజర్‌లో చెప్పినట్లు మిస్‌ అయిన ఓ పాయింట్‌ ఏంటి? అనే అంశాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అనేలా టీజర్‌ ఉండటం గమనార్హం .టీజర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ప్రకారం విశ్వంత్‌ పాత్ర పజిలింగ్‌గా అందరూ అనుమాన పడేలా కనిపిస్తుంది. మరో వైపు ఇదే క్యారెక్టర్‌ 2019లో జరిగిన దిశ రేప్‌, మర్డర్‌ కేసు గురించి చెప్పటం అప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన ఎమోషనల్‌ రియాక్షన్స్‌, దానికి పోలీసులు చూపించిన యాక్షన్‌ గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు వరుస హత్యల వెనుకున్న సీరియల్‌ లింకును సునీల్‌ ఏం మిస్‌ చేసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సునీల్‌, విశ్వంత్‌ క్యారెక్టర్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. పోలీసులు చేసే ఇంటరాగేషన్‌, ప్రొసీజర్స్‌, పోర్షన్స్‌, బ్యాక్‌డ్రాప్‌ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ విడుదల చేస్తుంది. ఐతే త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తామని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా హిట్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవాలని సునీల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: