ఈరోజే తారకరత్న అంత్యక్రియలు.. ఎక్కడంటే..?

Divya
సినీ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి సమయం లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే .తారకరత్న మృతితో పలువురు సినీ సెలబ్రిటీలు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా కన్నీరు అయ్యారు. తారకరత్న మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో పలు విషాదఛాయలు కూడా అలుముకున్నాయి. ఇక తారకరత్న గుండెపోటుతో గడిచిన 23 రోజుల క్రితం వెంటేలెటర్ పైన చికిత్స పొందుతూ ఉండేవారు.శనివారం రాత్రి తుది శ్వాస విధించడం జరిగింది.

ఈ రోజున తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:00 గంటలకు మోకిలా నుంచి ఫిలిం ఛాంబర్ కి భౌతికయం తరలించనున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటలకల్లా తారకరత్న పార్థివ దేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకోబోతున్నట్లు సమాచారం. అభిమానులు సందర్శనం కోసమే ఫిలిం ఛాంబర్ లో ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ భౌతికాయాన్ని ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక అక్కడికి నందమూరి కుటుంబ సభ్యులు టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ ప్రముఖుల సైతం నివాళులు అర్పించేందుకు భారీగానే తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తారకరత్న మృతి చెందిన విషయాన్ని భార్య అలేఖ్య తెలుసుకొని తీవ్ర అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తారకరత్న మరణించిన వార్త తెలిసినప్పటి నుంచి తాను ఇమే తినకుండా ఉండడం వల్ల నీరసం తో ఇలా స్వస్థకు గురైందని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక తారకరత్న ఇంటికి ఎంతో మంది సిని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ,నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అక్కడే ఉండి అలేఖ్య రెడ్డి ని ఓదారుస్తున్నారు. ఏది ఏమైనా ఒకవైపు సినిమాల లో ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో రాణించాలని ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న తారకరత్న అలాంటి సమయంలోనే ఇలా జరగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ప్రతి ఒక్కరు తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: