ధనుష్ 'సార్' ని నెత్తిన పెట్టుకున్న తెలుగు ఆడియన్స్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సహజమైన నటనతో దేశావ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ముఖ్యంగా సామాన్యుల జీవితాలను తన నేచురల్ యాక్టింగ్ తో తెరపై చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ధనుష్ సంపాదించుకున్నారు.ఇక ఆయన హీరోగా రీసెంట్ గా వచ్చిన మరో తాజా సినిమా సార్. తెలుగులో ఇది ఆయనకు స్ట్రెయిట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా మంచి అంచనాల నడుమ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఆడియన్స్ థియేటర్స్ కు చాలా ఎక్కువగానే తరలి వెళ్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బైలింగ్వల్ మూవీగా రూపొందింది. విద్యను వ్యాపారంగా మార్చుతోన్న వారిపై ఓ సాధారణ లెక్చరర్ చేసిన పోరాటం నేపథ్యంలో కమర్షియల్ మెసేజ్ ఎంటర్టైనర్గా వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ చాలా భారీగానే వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.


బ్రేక్ ఈవెన్ కు కూడా ఈ సినిమా చాలా తక్కువ దూరంలో ఉంది.నైజాం ఈ సినిమా 2.34కోట్లు,  సీడెడ్ రూ. 77లక్షలు, ఉత్తరాంధ్ర రూ.74లక్షలు, తూర్పు గోదావరి రూ.57 లక్షలు, పశ్చిమ గోదావరి రూ. 22 లక్షలు ఇంకా గుంటూరు రూ.49 లక్షలు  కృష్ణ రూ. 42లక్షలు, నెల్లూరు రూ. 25 లక్షలు ఇక మొత్తంగా తెలంగాణ ఇంకా ఏపీ కలిపితే.. 2 రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 5.80 కోట్లు (రూ.10.54 కోట్లు గ్రాస్)గా ఉంది.మూవీకి ఓవర్రాల్ గా ఫస్ట్ డే 5.50 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 6 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. అంటే బాక్సాఫీసు దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 0.20 లక్షల రూపాయల అందుకోవాల్సి ఉంది. అప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్ అవుతుంది. ఈ రోజు ఆదివారం కాబట్టి మరింత వసూళ్లను ఖచ్చితంగా సాధిస్తుంది. దీంతో ఇక ఈ సినిమా లాభాలను అందుకున్నట్టే.కంటెంట్ బాగుంటే చాలు ఎటువంటి భాషా బేధం లేకుండా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: