తారకరత్న జీవితంలో ఇన్ని కష్టాలా.!!

Divya
1983లో ఫిబ్రవరి -22 వ తేదీన నందమూరి మోహన్ కృష్ణ, శాంతి మోహన్ దంపతులకు జన్మించారు తారకరత్న. ఇక తారకరత్న నాన్న మోహన్ కృష్ణ ఎన్టీఆర్ నిర్మించిన ఎన్నో చిత్రాలకు డిఓపి గా కెమెరామెన్ గా పనిచేశారు. ఇక మోహన్ కృష్ణ శాంతి లకు ఒక్కడే కుమారుడు. చెన్నైలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారట. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు వచ్చేయడంతో నందమూరి కుటుంబం కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యిందట. ఇక్కడ జూబ్లీహిల్స్లో భారతీయ విద్యా భవన్ లో హైస్కూల్లో విద్య గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు సమాచారం.
బైక్ రైడింగ్ స్నేహితులతో కలిసి వెళ్లడం సినిమాలకు వెళ్లడం వంటివి తారక్ చాలా ఇష్టమట. ఆ తర్వాత హైదరాబాదులో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలోనే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. ఇక 2012లో దయా సినిమా షూటింగ్ సమయంలో తారకరత్నకు అలేఖ్యరెడ్డి పరిచయమైంది. అలా నందీశ్వరుడు సినిమాకు కూడా ఆమెనే కాస్ట్యూమ్స్ డిజైనర్ గా సెట్ చేసుకోవడం జరిగింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకోవడంతో పెద్దలు ఒప్పుకోలేదట.

హైదరాబాద్ శివారులో సంఘీ టెంపుల్లో తారకరత్న, అలేఖ్య రెడ్డి రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి రిటైర్డ్ ఆర్డీవో మధుసూదన్ రెడ్డి కుమార్తె. విజయ్ సాయి రెడ్డికి స్వయాన కోడలు వరుస అవుతుంది. తారకరత్న అలేఖ్య రెడ్డిది లవ్ మ్యారేజ్ కావడంతో .. కొద్దిరోజులు తారకరత్న కుటుంబం వీరిని దూరం పెట్టిందట. ఆ తర్వాత అందరూ కలిసిపోయారు ప్రస్తుతం వీరికి.. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్యంగా కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు పూజలు చేసిన అవి ఫలించలేదు. నిన్నటి రోజున రాత్రి తారకరత్న మరణ వార్తతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీ శోకసముద్రంలోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: