చరణ్ మూవీ కోసం గాయాలపా లైన పీటర్ హెయిన్స్....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ రాంచరణ్  హీరోగా చేసిన తన రెండో మూవీ మగధీర. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెల్సు. ఐతే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, అప్పట్లో ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తన ఖాతా లో వేసుకుంది.
అందులో చరణ్ యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అయ్యారు హీరోయిన్ గా చందమామ కాజల్ చేసింది. పెరియాడికల్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి.
వాటిలో ముఖ్యంగా బైక్ జంపింగ్ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. రామ్ చరణ్ ఇంట్రో సీన్ గా వచ్చిన ఈ సీన్  తెరకెక్కించడానికి యూనిట్ చాలా కష్టపడింది. ఫైట్ ను డిజైన్ చేసిన తర్వాత  దానికి సంబంధించిన అన్ని రెడీ అయ్యాయి. రిహార్సిల్స్ కూడా చేశారు. ఫస్ట్ యాంగిల్ లో బైక్ ను స్టార్ట్ చేసి జంప్ చేయించారు.
బైక్ గాల్లోకి లేవడం వరకు షాట్ ఒకే అయ్యింది.బైక్ అలా గాల్లోకి లేచిన తరువాత బైక్ ను వదిలేయాలి గాల్లో ఉంచిన ఐరెన్ ఫ్రేమ్ మీద నుంచి అవతలికి దూకి గాల్లో ఉన్న బైక్ ను అందికొని దానిపై కూర్చోవాలి.ఈ సీన్ చేసిన  యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ కు గాయాలయ్యాయి. ఆయన చేతులకి, తలకి గాయాలయ్యాయి.
ఐతే ఆయన్ని వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.ఐతే, పీటర్ మాత్రం నాలుగు రోజులు టైం ఇవ్వండి సీన్ చేద్దాం అని చెప్పగా, కాదు కాదు పూర్తిగా కోలుకున్నాకే ఈ సీన్ చేద్దామని లేదంటే అసలు సీన్ తీసేద్దామని రాజమౌళి అన్నారట. ఐతే సరిగ్గా పదిరోజులకు పీటర్ హెయిన్స్ కోలుకున్నాడు ఆ తర్వాత అనుకున్నట్లుగానే సీన్ ను షూట్ చేశారు. ఐతే ఆ సీన్ ఈ మూవీ లో ఒక హైలైట్ గా నిలిచింది.బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో దుమ్ము దులిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: