దూకుడు: విడుదలై 11 ఏళ్ళు దాటినా ఆగని రికార్డులు?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని బ్లాక్ బస్టర్ సినిమాలు వున్నాయి.అవి కేవలం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే కాదు.ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టి చరిత్ర తిరగరాసిన సినిమాలు కూడా.అందులో ఒక సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా. ఈ సినిమా 2011 వ సంవత్సరంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమాను శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా స్పెషల్ షో స్ వేస్తున్నారు.ఇక అందులో భాగంగా.. హైదరాబాద్ సుదర్శన్ 35 MMలో దూకుడు స్పెషల్ షో వేయనున్నారు. ఈ సినిమా స్పెషల్ షోకు సంబంధించిన బుకింగ్ ఓపెన్ అయిందో లేదో కేవలం అతి కొద్ది గంటల వ్యవధిలో ఈ టికెట్స్ హాట్ కేకుల్లా దెబ్బకు సోల్డ్ ఔట్ అయ్యాయి.ఈ సినిమా 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై అప్పటిదాకా ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి ఓ రేంజ్‌లో అదరగొట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్‌ ఇంకా బ్రహ్మానందం వంటి స్టార్ నటులు ముఖ్య పాత్రలో కనిపించారు.దూకుడు సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఇంకా అనిల్ సుంకర నిర్మించగా..ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.


ఈ సినిమా విడుదలై ఇప్పటికి పదకొండు సంవత్సరాల పైనే అవుతోంది. ఇక దూకుడు సినిమాలో డైలాగ్స్ కానీ.. విజువల్స్ కానీ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు తెలంగాణ యాసలో మాట్లాడడం అయితే ఫ్రెష్‌గా ఉండి తెలుగు వారికి ఎంతగానో నచ్చింది.దూకుడు సినిమాని మొత్తం రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తీయగా.. ఈ సినిమా ఏకంగా 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌  ఇంకా రూ. , 101 కోట్లకు గ్రాస్  వసూళ్లు రాబట్టి అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇంకా అంత మాత్రమే కాదు సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దూకుడు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా చరిత్ర నెలకొల్పడమే కాకుండా చాలా అవార్డులను కూడా దక్కించుకుంది.ఈ సినిమా ఏకంగా ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అలాగే ఓవర్ సీస్ లో తొలి 1 మిలియన్ డాలర్ల తెలుగు సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: