అల్లు అర్జున్ స్టైలింగ్ కి కారణం ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. విభిన్నమైన సినిమాల్లో నటించి స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకున్నాడు. అల్లు అర్జున నటనకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోవెర్లు ఉన్నారో ఆయన స్టైల్ కి మాత్రం అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రెగ్యులర్ లైఫ్ లో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. తెరపై బన్నీ కాస్ట్యూమ్స్ సెలక్షన్స్ కి ఫిదా అవుతారు చాలామం.ది కేవలం బట్టల విషయంలోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా బన్నీ స్టైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. 

సాధారణంగా అల్లు అర్జున్ ఏ డ్రెస్ వేసినా కూడా తనకి చాలా బాగా కనిపిస్తుంది. క్యాజువల్ వేర్ డిజైన్ వేర్ ఇలా ఏది బన్నీ వేసుకున్నప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైన స్టైల్ మెయింటైన్ చేస్తాడు అల్లు అర్జున్. అందుకే స్టైలిష్ స్టార్ అనే బిరుదు కూడా అల్లు అర్జున్కి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంత స్టైలిష్ గా కనబడే అల్లు అర్జున్ స్టైల్ వెనుక ఎవరున్నారు అని ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. అయితే స్టైలింగ్ వెనుక గాడ్ ఎవరు అనేది చెబితే కచ్చితంగా షాక్ అవుతారు. అల్లు అర్జున్ పర్సనల్ స్టైలిస్ట్ హార్మోన్ కవర్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్లను తాజా ఇంటర్వ్యూలో బయట పడడం జరిగింది. సాధారణంగా అల్లు అర్జున్కి బ్లాక్ కలర్ ఉంటే చాలా ఇష్టం.

 ఏ ఈవెంట్లో అయినా అల్లు అర్జున్ బ్లాక్ కలర్ దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటాడు. అందుకే ప్రతి కాస్ట్యూమ్ బ్లాక్ కలర్ కామన్ గా ఉంటుంది. అంతేకాదు ఆ కలర్ బన్నీకి ఒక సెంటిమెంట్ అని కూడా అంటారు. ఏ వేదిక కి వెళ్లాలన్న తన స్టైల్ ని బ్లాక్ లో ఎలివేట్ చేసే దిశగా తన కాస్టింగ్లను డిజైన్ చేయించుకుంటూ ఉంటాడు అల్లు అర్జున్. బ్లాక్ కలర్ అల్లు అర్జున్ దృష్టిలో ఒక బ్రాండ్ అని కూడా అంటారు. ఇకపోతే ప్రతి ఈవెంట్లో బన్నీ బ్లాక్ డ్రెస్ ని వేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడని హార్మన్ ఇటీవల చెప్పాడు .అయితే బన్నీ ఇలా ప్రతి ఈవెంట్లో బ్లాక్ వేసుకోవడానికి స్ఫూర్తి మాత్రం ఆయన మావయ్య మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: