అల్లు అర్జున్ రికార్డుపై.. కన్నేసిన మెగాస్టార్ చిరంజీవి?

praveen
మెగాస్టార్ చిరంజీవి 2023 ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి వింటేజీ మెగాస్టార్ ను చూసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.

 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇక చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. అయితే ఇక ఈ సినిమాల్లో చిరంజీవి మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టడంతో ఈ సినిమాను చూసినవారు మళ్లీ మళ్లీ చూసి చిరంజీవి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో అటు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లతో పాటు ఓటీటి వ్యూయర్ షిప్ విషయంలో కూడా ఎన్నో సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. కాగా వాల్తేరు వీరయ్య ఫిబ్రవరి 27వ తేదీన ఓటీటిలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటిపోయిన సరే ఇంకా 300 థియేటర్లలో సినిమా ఆడుతుంది అని చెప్పాలి. మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది.

 అయితే శివరాత్రికి కొత్త సినిమాలు విడుదలవుతాయి. కాబట్టి ఇక కొన్ని థియేటర్ల నుంచి వాల్తేరు వీరయ్య సినిమాను తీసేసే అవకాశం ఉంది. ఇలా తీసేసినా కూడా 150 థియేటర్లలో అయినా ఇక ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు పెద్దగా లేవు. ఇక అలా వైకుంఠపురం లో సినిమా 175 సెంటర్లలో 50 రోజుల పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు  శివరాత్రికి విడుదల అయ్యే సినిమాలు సరిగా ఆడకపోతే.. ఈ సినిమా రికార్డును మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: