సూర్యవంశంలో వెంకటేష్ మనవడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇక ఎప్పటికీ ప్రేక్షకుల మధిలో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఆ తర్వాత కాలంలో ఇక ఇండస్ట్రీలో హీరోలుగా మారుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇలా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక ఎలా ఉన్నారు అన్నదానికి సంబంధించిన ఫోటోలు వార్తలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెంకటేష్ కెరియర్ లో సూపర్ హిట్ మూవీలలో ఒకటిగా ఉంది సూర్యవంశం సినిమా. అయితే ఇక ఈ సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లోను వెంకటేష్ నటించాడు. అయితే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన వెంకటేష్ కు మనవడిగా చేసిన బాల నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అతని పేరు ఆనంద్ వర్ధన్. సూర్యవంశం సినిమాలో తన క్యూట్ క్యూట్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు.

 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆనంద్  ఇక పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇక తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టి సినిమాలకు దూరం అయిపోయాడు. ఇక ఇప్పుడు బీటెక్ పూర్తి చేశాడు ఆనంద్. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే హీరో పాత్రల కోసమే కాకుండా ఇండస్ట్రీలో ఏ మంచి పాత్ర దొరికిన చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే వరుసగా ఆడిషన్స్ లో పాల్గొంటూ ఉన్నాడట. ఒకప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించినా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నదానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ఫోటో చూసి ఆనంద్ వర్దన్  ఇంత పెద్దవాడు అయిపోయాడు అని సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: