Health update: ఆందోళనకరంగా మారిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి...!

Divya
నందమూరి తారకరత్న గత 20 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక్కసారి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో అభిమానులలో మరింత ఆందోళనలు మొదలవుతున్నాయి. నిజానికి తొలినాళ్లతో పోలిస్తే తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని ఆయన పరామర్శించిన వారు కూడా మీడియాతో చెబుతున్నారు. ఇక వైద్యులు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇదిలో ఉండగా గురువారం తారకరత్న మెదడు, తల భాగానికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆయన గుండె, మూత్రపిండాలు, కాలేయం సాధారణ స్థితికి వచ్చాయని కానీ కార్డియాక్ అరెస్టు కారణంగా తారకరత్న మెదడుకు రక్తప్రసరణ జరగకపోవడం వల్లే నీరు చేరి... మెదడు వాపుకు గురైంది అని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలోనే ఈరోజు తారకరత్న మెదడు పనితీరును తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది అని రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు లేదా రేపు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యుల నుంచి తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ,సినీ రాజకీయ ప్రముఖులు టిడిపి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తారకరత్న త్వరగా కోలుకొని మామూలు మనిషి కావాలని ఆకాంక్షిస్తున్నారు.  అంతేకాదు పలు ప్రాంతాలలో ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు.. తారకరత్నను విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు.  కానీ అక్కడి నుంచి వైద్యులను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.  అయినా కూడా ఆయన స్పందించడం లేదు అని సమాచారం. మరి ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి పై బులెటిన్ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: