పఠాన్: బాహుబలి 2 రికార్డ్ ఔట్? మరో గుడ్ న్యూస్ కూడా?

Purushottham Vinay
ఇక బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌ దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 'పఠాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ లోనే సాలిడ్ హిట్ ని అందుకున్నాడు. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెకెక్కించిన ఈ స్పై అండ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో షారుఖ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది.జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు.గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న పఠాన్‌ సినిమా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లో భారీగా విడుదల అయ్యి బాక్సాఫీస్‌ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లను సొంతం చేసుకోని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇక ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా పఠాన్‌ సినిమా మొత్తం రూ.970 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. అందులో ఒక్క ఇండియాలోనే ఈ సినిమా రూ.605 కోట్లు రాబట్టగా ఇక ఓవర్సీస్‌లో అయితే రూ.365 కోట్లు రాబట్టడం విశేషం.


పలు సినిమాల రికార్డులను బద్ధలు కొట్టిన ఈ సినిమా ఆష్ట్రెలియాలో బాహుబలి 2 రికార్డులను బద్ధలు కొట్టి ఇండియన్ సినిమాల్లో టాప్ 2 గా నిలిచింది. అయితే పఠాన్‌ సినిమా కలెక్షన్లు వెయ్యికోట్లకు చేరువలో ఉన్న సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ప్రొడక్షన్‌ మూవీ లవర్స్‌కు ఒక చక్కటి శుభవార్త చెప్పింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 17)న దేశ వ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్స్‌లలో కేవలం రూ. 110కే ఈ సినిమాను పఠాన్‌ ను ప్రదర్శించనున్నట్టు ప్రకటించింది.ఇంకా ఈ ఆఫర్‌ ప్రకారం సాధారణ థియేటర్లతోపాటు పీవీఆర్‌, ఐనాక్స్‌ ఇంకా సినీపోలిస్‌ వంటి అన్ని మల్టీప్లెక్స్‌లో కూడా రూ. 110 రూపాయలకే పఠాన్‌ చూడవచ్చు. కాగా సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెత్‌తో తెరకెక్కిన పఠాన్‌ సినిమా డిజిటిల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా మొత్తం రూ.100 కోట్ల డీల్‌ కుదిరినట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో బాగా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న పఠాన్‌ సినిమా మార్చి మూడో వారంలో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావచ్చని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: