ఘనంగా వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

Divya
ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.. ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో భారీ స్థాయిలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సభ్యులు పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అఖిల్ అక్కినేని రాబోతున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు అంచనాలు బాగా పెరిగిపోయాయి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యం విష్ణు కథ సినిమాను జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్ లో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేసిన విషయం తెలిసిందే.
ఆ అనుబంధం తోనే అఖిల్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఫోన్ నెంబర్ నైబరింగ్ అనే కాన్సెప్ట్ తో లవ్ యాక్షన్ గా వస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్గా కశ్మీరా పరదేశి నటిస్తోంది .ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా సినిమాపై హైపు పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్న నేపథ్యంలో ఇందులో మురళీ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మొదట ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.. కానీ అదే రోజున విడుదలకు సిద్ధంగా ఉంది. అందులోనూ థియేటర్ల కొరకు ఏర్పడడంతో సినిమాను  ఫిబ్రవరి 18 అంటే మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేయబోతున్నారు.. మరి ఇంతటి పర్వదినాన ఆ మహా శివుడు కిరణ్ అబ్బవరానికి తన ఆశీస్సులు అందిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: