దాదాపు 10 ఏళ్ల తర్వాత.. టాలీవుడ్ లోకి ఆ స్టార్ హీరోయిన్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు అని చెప్పాలి. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఒకరు అని చెప్పాలి. భద్ర సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమాలో తన అందం అభినయంతో తెలుగింటి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

 ఇక ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించింది అని చెప్పాలి. అయితే మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్గా హవా నడిపించడం ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి సమయంలోనే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో చివరికి పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.  అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరమై పదేళ్లు గడిచిపోతున్న ఇప్పటికి మీరాజాస్మిన్ పేరు ఎత్తితే చాలు అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తన పుట్టినరోజు నాడు మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు.

 కొన్ని రోజుల క్రితమే మీరాజాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. దీంతో మీరాజాస్మిన్ ఏ సినిమా చేస్తుంది అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. చివరికి ఇక ఇప్పుడు మీరాజాస్మిన్ నటిస్తున్న సినిమా పేరు బయటకు వచ్చేసింది. విమానం అనే సినిమాతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుందట మీరాజాస్మిన్. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుందట. జి స్టూడియోస్, కేకే క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా అమ్మాయి బాగుంది అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మీరా జాస్మిన్ తెలుగులో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: