రామ్ చరణ్ కోసం.. రంగంలోకి దిగబోతున్న ప్రభుదేవా?

praveen
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు త్రిబుల్ ఆర్ చేస్తున్న సమయంలోనే అటు తమిళ సెన్సేషన్ దర్శకుడు అయిన శంకర్ తో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అటు కియారా అద్వానీ రాంచరణ్ కు జోడిగా నటిస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు అటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.

 కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లు ఇక నృత్యాలను సమకూర్చారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్టర్, స్టార్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా ఈ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాట కోసం ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా పనిచేయబోతున్నాడట. దీంతో ఇక ఈ పాటలో డాన్స్ ఎలా ఉండబోతుందో అనే దానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఇకపోతే ప్రస్తుతం ఒకే సమయంలో శంకర్ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ ను శరవేగంగా ముందుకు నడిపిస్తూనే... మరోవైపు చరణ్ సినిమా షూటింగ్ ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఏదైనా వస్తుందేమో అని అటు అభిమానులు అందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: