కాజల్ అగర్వాల్ కి @16 యేళ్లు..!

Divya
భారతీయ సినీనటిగా, మోడల్గా హిందీ చిత్రాలతో పాటు తెలుగు , తమిళ్ భాషలలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 50 కి పైగా చిత్రాలలో పని చేసి.. రెండు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. మొదటిసారి 2004 హిందీ చిత్రం క్యూన్ తో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె హో గయానా లో కూడా నటించింది. ఆ తర్వాత 2007లో మొదటిసారి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యే అదే సంవత్సరంలో చందమామ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది..
ఆ తర్వాత 2009లో తెలుగులో వచ్చిన ఫాంటసీ యాక్షన్ చిత్రం మగధీర.. ఆమె కెరియర్ లో ఒక మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఎక్కువగా నటించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుని ఉత్తమ నామినేషన్లు కూడా పొందింది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అభిమానులు సెలబ్రిటీలు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇటీవల తండ్రి కొడుకులతో కూడా నటించి మరో అరుదైన రికార్డును నెలకొల్పింది.
తన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే తన బాల్య స్నేహితుడు గౌతమ్ కిచ్చులను 2020 అక్టోబర్ 30  తేదీన వివాహం చేసుకుంది. అంతేకాదు 2022 ఏప్రిల్ 19న ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.. 2016లో కన్నడ సినిమా చక్ర వ్యూహాలు ఏనైతు అనే పాటను పునీత్ రాజకుమార్ తో కలిసి పాడి శ్రోతలను అలరించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవడం కోసం తన్ను తాను మరింతగా మార్చుకుంది మొత్తానికి అయితే ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో అవకాశము దక్కించుకున్న ఈమె మళ్లీ బిజీ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: