సార్: ధనుష్ కెరీర్లోనే హైయెస్ట్ అట?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి లేటెస్ట్ గా తెరకెక్కించిన మూవీ 'సార్'. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీని తమిళంలో 'వాతి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాకి ముందు వెంకీ అట్లూరి 'రంగ్ దే' సినిమా తీశాడు. నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. అయినా కానీ వెంకీ అట్లూరికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ సువర్ణ అవకాశాన్నిచ్చాయి.పైగా ధనుష్ లాంటి పాన్ వరల్డ్ హీరో ఇంకా బైలింగ్వల్ మూవీ కావడంతో ఈ సినిమా వెంకీ అట్లూరి కెరీర్ కి ఇప్పుడు చాలా కీలకంగా మారింది. యంగ్ డైరెక్టర్ కు ఇలాంటి అవకాశం రావడమే చాలా అరుదు.అలాంటిది సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంస్థల ద్వారా ఈ ఛాన్స్ లభించింది. దీంతో ప్రతీ ఒక్కరి చూపు ఇప్పుడు ఈ సినిమాపై పడింది. 'రంగ్ దే' సినిమా ఫ్లాప్ ని దక్కించుకున్న వెంకీ అట్లూరికి 'సార్' సినిమా ఇప్పుడు అగ్ని పరీక్షగా మారినట్టుగా సమాచారం తెలుస్తోంది.

ధనుష్ లాంటి స్టార్ హీరో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కానీ నిర్మాణ సంస్థలు కావాలన్నది అడిగి మరీ సమకూర్చడంతో పేరున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంకా అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది.ఫిబ్రవరి 17 వ తేదీన ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో ధనుష్ కెరీర్ లోనే ఎక్కువ థియేటర్ లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.పైగా ఈ సినిమా చెయ్యడానికి ధనుష్ చాలా ఎక్కువ టైం కూడా తీసుకున్నాడు. సినిమాలు చాలా స్పీడ్ గా చేసే ధనుష్ ఈ సినిమాకి ఎక్కువ టైం తీసుకున్నాడు.ఇక తనకి ఓ ఫ్లాప్ సినిమా తరువాత వచ్చిన ఈ అవకాశాన్ని వెంకటీ అట్లూరి ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నాడు? అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 17 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..కాగా ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చాలా భారీ స్థాయిలో జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: