బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్న నవదీప్..!!

Divya
టాలీవుడ్లో గత 2 సంవత్సరాలుగా బ్యాచిలర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఒక్కొక్కరిగా వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న హీరో నవదీప్ కూడా ఇంకా సింగిల్గానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో చెప్పే మాటలు వింటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే పెళ్లిపై తనకు ఉద్దేశమే లేదు అని పలు సందర్భాలలో కూడా చెప్పకొచ్చాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తెస్తున్నప్పటికీ తాను పట్టించుకోవడంలేదని కూడా ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకి నవదీప్ కూడా త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది . వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో అతను షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది.. ఈ ఫోటో ఒక అమ్మాయి సిగ్గుతో తన మొహాన్ని దాచుకొని సిగ్గుపడుతూ ఎంగేజ్మెంట్ రింగును చూపిస్తున్న ఫోటో నవదీప్ షేర్ చేశాడు . అంతే కాదు దీనికి ఖుషి అహుజా అని పేరు కూడా ట్యాగ్ చేయడంతో నిజంగానే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి..
ఇకపోతే ఆ అమ్మాయిని నవదీపు వివాహం చేసుకోబోతున్నాడు ఆమెతో నిశ్చితార్థం జరిగిందా? ఇక్కడున్నది ఆమెనా అంటూ పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే మరొకవైపు ఖుషి ఆహుజా అనే అమ్మాయి పేరు ట్యాగ్ చేయడంతో ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్టులు ఫోటోలు ఏవి కనిపించడం లేదు దీంతో అందరినీ ఫ్రాంక్ చేయడానికి నవదీప్ పోస్ట్ చేశాడని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం తెలిసే ఆస్కారం లేదు. ఇకపోతే ఈయన తాజా చిత్రాల విషయానికి వస్తే న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: