కొరటాలను కన్ఫ్యూజ్ చేస్తున్న జాన్వీ కపూర్ ?

Seetha Sailaja
శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇమేజ్ రీత్యా టాప్ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ ఆమెకు చెప్పుకోతగ్గ కమర్షియల్ హిట్ ఇప్పటివరకు రాకపోవడంతో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళలేకపోతోంది. అయినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా భారీ సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

లేటెస్ట్ గా వచ్చేనెల నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న జూనియర్ కొరటాల శివల మూవీ ప్రాజెక్ట్ విషయంలో జాన్వీ కపూర్ కొరటాల ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తోంది అని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథను ఆమెకు చెప్పినప్పటికీ ఆమెకు ఏర్పడుతున్న కొన్ని సందేహాలను తీర్చడంలో ఏకంగా కొరటాల కూడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో జాన్వీకపూర్ నటించడానికి ఆమె పెడుతున్న కండిషన్స్ కొరటాల కు షాక్ ఇస్తున్నట్లు టాక్. పారితోషిక విషయంలో ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ ఈ మూవీ కథలో తనకు జూనియర్ తో సమానంగా పాత్ర ఉండి తీరాలి అని జాన్వీ కండిషన్ పెడుతోంది అని అంటున్నారు. దీనితో కొరటా ల ఈ మూవీలో జాన్వీ కపూర్ స్థానంలో మృణాల్ ఠాకూర్ పేరును పరిసీలిస్తున్నప్పటికీ ఆమె పట్ల జూనియర్ పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న వార్తలు కూడ వస్తున్నాయి.

దీనితో ఈమూవీ కథ విషయమై ఎన్నో అగచాట్లుపడ్డ కొరటాల ఇప్పుడు ఈమూవీకి సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక విషయంలో కూడ కొరటాల కు ఆఖరి నిముష సమస్యలు ఎదురౌతున్నాయి అంటూ మరికొందరు గాసిప్పులు పుట్టిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎంపిక కూడ పూర్తి కాలేదు అని అంటున్నారు. విక్రమ్ విజయ్ సేతుపతి సైఫ్ అలీ ఖాన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ వారంతా చాల బిజీ ఆర్టిస్టులు కావడంతో డేట్స్ విషయంలో ఎంతవరకు వారి సహకారం ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ కూడ కొరటాలకు ఉంది అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: