జనతా గ్యారేజ్ కాంబో వద్దంటున్నా నందమూరి ఫ్యాన్స్...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ స్టార్ హీరోల్లో టాప్ స్థానంలో ఉన్న హీరోల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకేక్కుతున్న మూవీ  షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెలలో జరగబోతున్న విషయం తెల్సిందే. ఐతే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికి తెలుసు.
ఆలా వచ్చిన ఆ మూవీ అప్పట్లో పాజిటివ్ టాక్ని కైవసం చేసుకుంది.ఐతే జనతా గ్యారేజ్ విజయాన్ని మించి ఈ న్యూ ప్రాజెక్ట్ పేరు సాధించలని ఎన్టీఆర్ అలాగే కొరటాల తెగ ట్రై చేస్తున్నారట. అలాగే వీరి కాంబినేషన్ మీద ఫ్యాన్స్ కి కూడా భారీ అంచనాలు పెరిగి పోయాయి. ఐతే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ను ఒక కీలక పాత్రలో నటింపజేసిన విషయం తెల్సిందే. ఐతే ఇప్పుడు కూడా మరోసారి మోహన్ లాల్ ను డైరెక్టర్  కొరటాల శివ తీసుకు వచ్చేందుకు ఆలోచిస్తున్నాడని సమాచారం.ఐతే ఆ విషయమై ఇంకా అధికారికంగా ఆఫీషల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు.ఐతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్  కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా లో మోహన్ లాల్ వద్దు బాబోయ్ అంటూ కొందరు అంటున్నారు.
ఐతే ఇక్కడ మాత్రం జనతా గ్యారేజ్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదని వారి ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్ నిలవలేదని మాములుగా ఆడిందని గుర్తు చేసుకున్నారు.ఐతే మొత్తానికి మోహన్ లాల్ ని ఎన్టీఆర్ ముప్పైయి లో చేయడం పట్ల నందమూరి అభిమానులు కొంతమంది బాగా వ్యతిరేకతతో ఉన్నారు. ఐతే మరి అది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. కొరటాల శివ కనుక ఆ విషయమై నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం ఆయన మీద విమర్శలు తీవ్రంగా వచ్చే ఛాన్సెస్ బాగా కనబడుతున్నాయి. ఐతే కాయిన్ కి రెండు వైపులా ఉన్నట్లు దీనికి కూడా ఇంకో విషయం తెగ వైరల్ అవుతుంది. దీంట్లో మోహన్ లాల్ కాదు బాలీవుడ్ స్టార్ నటుడు ఈ మూవీ కోసం వర్క్ చేయబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే అది ఎంత వరకు నిజం అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జతగా బాలీవుడ్ బ్యూటీ ఐనా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయబోతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై కూడా తొందరగానే క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: