వేదాంతిగా మారిన నాని !

Seetha Sailaja

ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు విడుదల అవుతున్న సినిమాలలో ‘దసరా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక భారీ కమర్షియల్ హిట్ కొట్టాలి అన్న లక్ష్యంతో నాని నటిస్తున్న ఈమూవీ పై విపరీతమైన భారీ బడ్జెట్ ఖర్చుపెట్టారు. తనకు స్వతహాగా ఏర్పడిన ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్ నుండి బయటకు రావడానికి నాని ఈసినిమాలో రస్టిక్ సబ్జెట్ ను ఎంచుకోవడమే కాకుండా తన కెరియర్ లో ఎప్పుడు వేసుకోని వైవిధ్యమైన రఫ్ లుక్ తో ఈమూవీలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈమూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన మరొక పాటను విడుదల చేసారు. ఇప్పుడు ఈపాట పైనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘వారి ఓరి నీదుర పోరి’ అంటూ సాగే ఈపాటలో హీరో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చెప్పుకునే విధంగా డిజైన్ చేసిన ఈపాట యూత్ కు బాగా నచ్చినట్లు సంకేతాలు వస్తున్నాయి.    

గేయ రచయిత శ్రీమణి ఈపాటలో వాడిన ప్రతి పదంలోనూ వేదాంతం కనిపిస్తోంది. బాల్యానికి యవ్వనానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ బాల్యమే గొప్పది అన్న సందేశం ఈపాటలో కనిపిస్తోంది. అయితే శ్రీమణి కూర్చిన పదాలకు ఇచ్చిన ట్యూన్ మాత్రం అంత క్యాచింగ్ గా లేదని కొన్ని విమర్శలు కూడ వస్తున్నాయి.

అయితే ఈపాట చిత్రీకరణ బాగుంటే ఈ పాట ట్యూన్ గురించి ప్రేక్షకులు మర్చిపోయే ఆస్కారం ఉంది. సమ్మర్ రేస్ కు విడుదల కాబోతున్న ‘దసరా’ పోటీగా భారీ సినిమాలు ఏమి రావడంలేదు. దీనికితోడు టాప్ యంగ్ హీరోలు అంతా ఈసమ్మర్ రేస్ కు దూరంగా ఉంటున్నారు. ఈ సమ్మర్ రేస్ లో చిరంజీవి రవితేజా ల సినిమాలు తప్పితే మిగతా సినిమాలు అన్నీ మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే. దీనితో నాని సినిమాకు ఎలా చూసుకున్నా అన్నీ కలిసి వచ్చే అంశాలే కనిపిస్తున్నాయి. ‘దసరా’ మూవీ నాని ఆశలను తీర్చే అవకాశాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: