ఆ కారణంతోనే.. మోక్షాజ్ఞ ఎంట్రీ లేట్ అవుతోందా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇక చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారసులదే హవా నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఇదే కొనసాగుతోంది. ప్రస్తుతం ఒకప్పటి స్టార్ హీరోల వారసులే ఇక ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక వారే టాప్ ప్లేస్ లో కొనసాగుతూ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలా వచ్చిన వారే ప్రభాస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ లు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు సినీ ప్రేక్షకులకు కూడా వారసులను ఎక్కువగా ఆదరించడం లాంటివి చేస్తూ ఉండడం ఇటీవల కాలం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఇక తమ అభిమాన హీరో ఫ్యామిలీ నుంచి వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కావాలని వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. ఇక ఇప్పుడు బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం కూడా అభిమానులు అలాగే ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. నందమూరి నట సింహం బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయంపై గత రెండు మూడు సంవత్సరాలుగా ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది.

 ఇప్పటికే బాలయ్య తోటి హీరోలైన నాగార్జున చిరంజీవిలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అటు మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. అయితే 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫామ్ అంటూ మళ్ళీ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జాతకాలను నమ్మే అలవాటు ఉన్న బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో ఇదే ఫాలో అవుతున్నాడట. ఇక మోక్షజ్ఞ పేరు మీద జాతకం బాగా లేకపోవడం వల్ల ఎలక్షన్స్ తరువాత కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఓ సినిమా.. బోయపాటితో మరో సినిమా ఉంటుందట. ఇలా మోక్షజ్ఞ కోసం బాలయ్య ఇద్దరు డైరెక్టర్లను లైన్ లో పెట్టాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: