1000 కోట్ల క్లబ్ కి అడుగు దూరంలో పఠాన్?

Purushottham Vinay
మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ నెంబర్ 1 హీరోగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని కూడా ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ వరుస ప్లాపులతో 10 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు.2018 లో వచ్చిన జీరో ప్లాప్ తరువాత ఏకంగా 4 ఏళ్ళు బ్రేక్ ఇచ్చి తాజాగా పఠాన్ సినిమాతో తాను స్ట్రాంగ్ కం బ్యాక్ హిట్ మాత్రమే కాకుండా ప్లాపుల్లో ఉన్న బాలీవుడ్ ని కూడా బ్రతికించాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓవర్సీస్ లోనే ఏకంగా 400 కోట్లు వసూళ్లు రాబట్టిందంటే షారుఖ్ ఖాన్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


RRR, టైగర్ జిందా హై, భజరంగీ, దంగల్ ఇంకా kgf 2 ఇలా బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న ప్రతి సినిమా రికార్డుని కూడా బ్రేక్ చేసుకుంటూ రెండున్నర వారాలకే ఏకంగా 900 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపోయేలా చేస్తుంది పఠాన్ సినిమా. ఇక మళ్లీ వీకెండ్ అయిపోయింది కాబట్టి పఠాన్ సినిమా కలెక్షన్స్ ని సోమవారం నాటికి మళ్లీ పెరుగుతాయి.ఇక పఠాన్ సినిమా మరో 50 కోట్లు రాబడితే, వెయ్యి కోట్లకి చేరువవుతుంది. అదే జరిగితే అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా పఠాన్ సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తుంది.ఇక బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న ప్రతి సినిమా రికార్డుని బ్రేక్ చేస్తున్న పఠాన్ సినిమా ముందున్న ఏకైక రికార్డ్ బాహుబలి 2.ఈ  సినిమా బాలీవుడ్ లో ఏకంగా 511 కోట్లు రాబట్టింది. ఈ రికార్డుని కూడా లాంగ్ రన్ లో పఠాన్ సినిమా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: