ఏప్రిల్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎన్నో క్రేజీ తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఏప్రిల్ నెలలో విడుదలకు తేదీలను ప్రకటించి ఉన్న తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం.
మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు ఆయన సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న శకుంతలం మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఉగ్రం మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతున్న రుద్రుడు మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు.
సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన విరూపాక్ష మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి  పాన్నియన్ సెల్వన్ రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో చయాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్  త్రిష ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వం పార్ట్ 1 అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.
పంజా వైష్ణవ్ తేజ్ కెరియర్ లో నాలుగవ మూవీ గా రూపొందుతున్న సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: