HBD Jagapathibabu: పుట్టినరోజు సందర్భంగా జగపతిబాబు స్పెషల్ స్టోరీ..!

Divya
వీరమాచనేని జగపతి చౌదరిగా తెలుగు తెరకు పరిచయమై.. తర్వాత కాలంలో తన పేరును జగపతిబాబుగా మార్చుకొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈయన ఎవరో కాదు తెలుగు సినీ నిర్మాత , దర్శకుడైన విబి రాజేంద్రప్రసాద్ కుమారుడే.. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది అవార్లను కూడా సొంతం చేసుకున్న ఈయన.. కుటుంబ కథా చిత్రాలతో నటించి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథ చిత్రాలలో ఎక్కువగా పేరుగాంచిన కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశారు జగపతిబాబు.
ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు విలన్ పాత్రలు పోషించి మరొకసారి తన లోని విశ్వ నటుడిని చూపించే ప్రయత్నం చేశారు . ఈ క్రమంలోనే గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, రంగస్థలం ,లెజెండ్, శ్రీమంతుడు లాంటి సినిమాలలో అతను పోషించిన పాత్రలు నిజంగా సినిమాకే హైలెట్గా నిలిచాయి. నిజానికి విలన్ అంటే ఇలాగే ఉండాలి అని కొన్ని లిమిట్స్ పెట్టుకొని మరీ నటించినట్లు కనిపిస్తుంది. 1962 ఫిబ్రవరి 12న మచిలీపట్నంలో జన్మించిన తన తండ్రి వృత్తిరీత్యా మద్రాస్ లోనే పెరగడం జరిగింది. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్ బ్యానర్ అధినేత .. తమ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను కూడా వీరు తెరకెక్కించారు.
చదువయ్యాక కొద్ది రోజులు విశాఖపట్నంలో బిజినెస్ చేసిన ఈయన ఆ సమయంలో సినిమాల్లోకి వెళ్లాలని ఒక రాత్రిలో నిర్ణయించుకొని తన నాన్న పెద్ద నిర్మాత అయినా సరే ఆయన ప్రమేయం లేకుండా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు.. అయితే కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న వివి రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు యొక్క ఇష్టాన్ని తెలుసుకొని 1989లో సింహ స్వప్నం అనే సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఈ సినిమాలో కృష్ణంరాజు హీరోగా నటించిన తొలి సినిమాలోని ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడిగా జగపతిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత అంచలంచలుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: