లక్ అంటే సుహాస్ దే..ఏమిటంటే..?

Divya
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్ తోనే వచ్చిన నటీనటులు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.అలాంటి వారిలో హీరో సుహాస్ కూడా ఒకరు.. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన ఈ నటుడు మొదట్లో పలు చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ సినీ పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఇక తర్వాత కొన్ని రోజులకు కలర్ ఫోటో సినిమా హీరోగా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత వరుసగా సినిమాల అవకాశాలు అందుకున్నారు.

పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమా గతవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళుతోంది .ఈ చిత్రాన్ని ప్రశాంత షణ్ముఖ డైరెక్షన్ చేశారు ఈ సినిమా చూసిన స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు శివరాజ్ కుమార్ ఈ సినిమా పైన ప్రశంశాల వర్షం కురిపించారు. ఇక సుహాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫోటో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరొకసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సుహాస్ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై మరొక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.అధికారికంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రకటన తేదీ వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం .కరోనా సమయంలో ఓటీటి లో విడుదలైన  కలర్ ఫోటో సినిమాతో తమ ఆహా సంస్థ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుందని తెలిపారు అలాగే జాతీయ అవార్డు కూడా కలర్ ఫోటో సినిమా అందుకుందని తెలియజేశారు. అయితే మరొకసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అని తెలియడంతో కచ్చితంగా ఈ సినిమా మరొక బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: