యువతకు ఆదర్శం గా నిల్చిన మెగాస్టార్ మూవీ...!!

murali krishna
టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు పొంది టాప్ స్టార్స్ లలో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న చిరంజీవి గారికి చిరంజీవికి సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి ఫ్యాన్స్ ఎల్లప్పుడూ రెడీ గా ఉంటారు.అప్పట్లో యండమూరి వీరేంద్రనాధ్ నవలను బేస్ చేసుకొని  చిరంజీవి, విజయశాంతి, సుహాసినిలతో ఏ కోదండరామిరెడ్డి గారు తెరకేక్కించిన  ఛాలెంజ్ సినిమా సూపర్ హిట్. చిరంజీవిని యూత్ ఐ కాన్ నిలబెట్టిన మూవీ  ఇది. ఇప్పటికీ కూడా ఈ మూవీ యూత్ కి ఒక ఆదర్శం అందుకే అనుకుంట అల్లు అర్జున్ జులాయి మూవీకి ఛాలెంజ్ సీన్ ని టివిలో చూపిస్తూ రిఫరెన్స్ గా వాడారు.
ఐతే మాస్ సినిమాలకు సరైన మీనింగ్ చెప్పిన కోదండరామిరెడ్డి అగ్ర హీరోలందిరికీ హిట్స్ అందించారు. ఐదేళ్లలో 50లక్షలు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దు కున్న ఈ మూవీ 10పైసల పెట్టుబడి, 5ఏళ్ళ సమయం, చట్టబద్ధంగా 50లక్షల టార్గెట్. ఓ కోటీశ్వరునితో నిరుద్యోగి చేసే సవాల్ అది
ఐతే చివరికి  గాంధీ క్యారెక్టర్ వేసిన చిరు ఈ సినిమాలో ఛాలెంజ్ ని స్వీకరించి విజయం సాధిస్తాడు. ఓ బిచ్చగత్తె ఇచ్చిన 10పైసలే అతడిని 50లక్షల సంపాదనకు మార్గం చూపింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి, కె ఎస్ రామారావు, యండమూరి వీరేంద్రనాధ్, సత్యమూర్తి ఈ ఐదుగురి కాంబినేషన్ లో వచ్చిన అభిలాష అనే ఇంకొక మూవీ సూపర్ హిట్ అయింది.
ఐతే అదే టైం లో డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు పేరిట ఓ సీరియల్ కూడా జ్యోతి మాసపత్రికలో రాసారు. సీరియల్ చదివాక కె ఎస్ రామారావు వెంటనే మూవీ ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. సాయినాధ్ గారు స్క్రీన్ ప్లే రాసారు. ఐతే ఈ కాన్సెప్ట్ తో తెరమీద ఆవిష్కరించడం కొంచెం కష్టమే యింది మన దర్శక నిర్మాతలకి.
ఐతే ఈ సినిమాకి  టైటిల్ ఏంటో చెప్పమని  జ్యోతి మాసపత్రికలో పాఠకులకు పోటీ నిర్వహించి, అందులోంచి ఛాలెంజ్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 45రోజుల్లో షూటింగ్ పూర్తికావడంతో ఆగష్టు నెలలో విడుదల చేసారు . ఇందులో డబ్బు లేకపోతె పనిలేదని రావుగోపాలరావు వాదన. కృషిచేస్తే ఫలితం వస్తుందని చిరంజీవి వాదన. దీక్షతో పనిచేస్తే యువతరం సాధించలేనిది ఏది లేదని ఛాలెంజ్ చేసిన కథ ఇది.
కనుకనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ కనుకనే  థియేటర్లలో విజిల్స్ వేయించింది. ఈ మూవీ లో లవ్ , రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్, ఎమోషన్ , ఇలా అన్నీ రంగరించిన మూవీ ఇది. ఐతే ఈ మూవీ లో అల్లు అరవింద్ కూడా అతిధి పాత్రలో మెరుస్తాడు. ఇళయరాజా స్వరాలూ కూర్చిన సాంగ్స్ సూపర్. కోదండరామిరెడ్డి గారి టేకింగ్ ఈ సినిమాని ని చిరస్థాయిగా నిలిపింది.ఐతే ఈ క్లాసిక్ మూవీ లాస్ట్లో నో ఎండ్ అనే కార్డు పడడం అనేది సందర్బనుసరంగా ఉండడం అనేది విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: