దసరా నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ అప్పుడే?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దసరా'. ప్రచారంతో ఈ సినిమా చాలా మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది. న్యాచురల్ నాని మాస్ అవతార్ ఇంకా అలాగే ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు ఒక రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈమధ్యనే విడుదలైన దసరా టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకొని నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరించి అన్ని భాషల్లో కూడా ఈ పాట టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అలాగే తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ అప్డేట్ ని ఇచ్చారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 వ తేదీన హార్ట్ బ్రేక్ యాంతం 'ఓరి వారి' అనే హార్ట్‌ బ్రేక్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.


శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.అలాగే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ ఇంకా అలాగే జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దసరా సినిమాని ప్రపంచవ్యాప్తంగా మార్చి 30 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.ఈ సినిమాతో ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ రేంజిలో నాని భారీ హిట్ కొట్టి పెద్ద పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: