బాలకృష్ణ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న చిరంజీవి వ్యూహాలు !

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవి తాను మనసులో అనుకున్న మాటలను ఆచరించి చూపెడతాడు కానీ అనవసరంగా ఆవేశపడడు. అందువల్లనే వివాదాలు చిరంజీవిని పెద్దగా వెంటాడవు. ఈతీరుకు పూర్తిగా భిన్నం బాలకృష్ణ నిరంతరం ఆవేశంతో రగిలిపోతు అనాలోచితంగా అన్నమాటలకు అతడు వివాదాలలో చిక్కుకుంటాడు. బాలకృష్ణ చిరంజీవిల మధ్య బయటపడని గ్యాప్ ఉంది అన్నవిషయం ఓపెన్ సీక్రెట్.

ఈసంక్రాంతికి రేస్ కు వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ మూవీని చూడటమే కాకుండా ఆమూవీ పై ప్రశంసలు కురిపించి చిరంజీవి తాను అందరివాడిని అని మరొకసారి చాటుకున్నాడు. ఇప్పుడు ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాలయ్య అభిమానులు ‘అన్ ష్టాపబుల్’ షోకు చిరంజీవి ఎందుకు రాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోకు చిరంజీవి అతిధిగా వస్తే వీరిద్దరి కాంబినేషన్ చూడాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఆశించారు.

అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు. దీనితో చిరంజీవి ఈషోకు రానని అన్నాడా లేదంటే ఈషోకి అతిధిగా రమ్మని ఆహ్వానం పంపలేదా అన్న అనేక ఊహాగానాలు వచ్చాయి. నిజానికి ఇలాంటి షోలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఈషోకి వచ్చినప్పుడు చిరంజీవి ఎందుకురాడు అంటూ బాలయ్య అభిమానుల సందేహం. అయితే ఎవరూ ఊహించని విధంగా చిరంజీవి మరొక ట్విస్ట్ ఇచ్చాడు.

తెలుగు పాప్ సింగర్ గా ఒక వెలుగువెలిగిన స్మిత ఇప్పుడు సోనీ లైవ్ ఓటీటీ లో ‘స్మిత తో నిజం’ అన్న షోను హోస్ట్ చేయబోతోంది. త్వరలో స్ట్రీమ్ కాబోతున్న ఈషో మొదటి ఎపిసోడ్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి రాబోతున్నాడు. ఇప్పటికే ఈ కార్యక్రమం రికార్డింగ్ కూడ పూర్తి అయింది అంటున్నారు. ఇప్పుడు ఈవిషయం బాలకృష్ణ అభిమానులకు అసహనాన్ని కల్గిస్తోంది. ఇండస్ట్రీ పెద్దన్నగా పేరుగాంచిన చిరంజీవి బాలకృష్ణ షోను పక్కకు పెట్టి స్మిత షోకు వెళ్ళడం ఎంతవరకు సబబు అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: