ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్న శ్రీముఖి అందాలు..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా స్టేటస్ ని అందుకోవడం అంటే అది చాలా సులువు కాదు.. ముఖ్యంగా అందచందాలతో చలాకీతనంతో ఎంతోమందిని అలరిస్తూ ఉండాలి. అలా యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది శ్రీముఖి. ఎలాంటి షో లోనైనా సరే ఆమె కామెడీ పంచులతో అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇక శ్రీముఖి ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విన్నర్ మాత్రం కాలేకపోయింది. శ్రీముఖి వివాహం గురించి ఎప్పటికప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.
కానీ ఇంతవరకు తన పెళ్లి విషయాన్ని మాత్రం ప్రకటించలేదు శ్రీముఖి.. శ్రీముఖి సినీ కెరియర్ విషయానికి వస్తే పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీముఖి ఆ తరువాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లోని నటిస్తూ ఉంటోంది. ముఖ్యంగా శ్రీముఖి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హాట్ గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా చేస్తోందని చెప్పవచ్చు. తాజాగా బ్లాక్ దుస్తులలో మెరిసిపోయి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీముఖి చిరంజీవితో కలిసి భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఏడాదైనా అభిమానుల కోరిక మేరకు శ్రీముఖి వివాహం చేసుకుంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఇక గతంలో కూడా శ్రీముఖి ఒకసారి తను లవ్ లో ఉన్నట్టుగా ఒక హింట్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు శ్రీముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: