"బెదురులంక" మూవీ టీజర్ లాంచ్ వేదిక ఖరారు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటు వంటి కార్తికేయ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందినటువంటి ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న కార్తికేయ ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

కేవలం సినిమాల్లో హీరో పాత్రలు మాత్రమే కాకుండా ఇప్పటికే కార్తికేయ ... నాని హీరో గా రూపొందినటువంటి నానిస్ గ్యాంగ్ లీడర్ అలాగే తమిళ్ లో అజిత్ హీరో గా రూపొందినటువంటి వలిమై సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ "బెదురులంక 2012" అనే మూవీ లో హీరో గా నటించాడు. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ,  థ్రిల్లర్ ఎంటర్టైనర్ కథతో రూపొందిన ఈ మూవీ లో అజైగోష్, సత్య అక్కల, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపిరాజు రమణ, ఎల్ బి శ్రీరామ్ తదితరులు నటించారు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆర్ కె సినీ ప్లేక్స్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: